ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 21:08:54

ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టివేత

ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టివేత

ఉండవెళ్లి : తెలంగాణ రాష్ర్టం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వివిధ వాహనాల్లో తరలిస్తున్న మద్యాన్ని బుధవారం అక్కడి పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లాకు చెందిన 11 మంది వ్యక్తులు 8 వాహనాల్లో 481 మద్యం సీసాలను అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తుండగా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. 

జిల్లాకు చెందిన పురుషోత్తం వద్ద 94 బాటిళ్లు, నరసింహ -9 బాటిళ్లు, నాగేంద్ర -25 బాటిళ్లు, గౌస్ -10, భాస్కర్ -10, కృష్ణారెడ్డి-18, మహేశ్వరరెడ్డి-22, దస్తగిరి-50, కె భాస్కర్- 6, బాబు-35, షేక్ షఫీ వద్ద నుంచి 192 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఈ 11 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరు ఆటోలు, బైకులపై మద్యాన్ని తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo