ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 17, 2020 , 13:02:58

డ్యాన్స్ చేస్తేనే కేసు న‌మోదు.. ఎస్ఐ వేధింపులు

డ్యాన్స్ చేస్తేనే కేసు న‌మోదు.. ఎస్ఐ వేధింపులు

ల‌క్నో : త‌న‌ను వేధిస్తున్న యువ‌కుడిపై ఫిర్యాదు చేయ‌డానికి పోలీసు స్టేష‌న్‌కు వెళ్తే అక్క‌డ కూడా ఆ యువ‌తిని ఎస్ఐ వేధింపుల‌కు గురి చేశాడు. డ్యాన్స్ చేస్తేనే కేసు న‌మోదు చేస్తాన‌ని ఎస్ఐ చెప్పాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కాన్పూర్ జిల్లాలోని గోవింద్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. 

16 ఏళ్ల బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి గోవింద్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఈ కుటుంబం ప‌లు వేడుక‌ల్లో డ్యాన్స్ లు చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తోంది. అయితే యువ‌తి అద్దెకుంటున్న య‌జ‌మాని అల్లుడు అనూప్ యాద‌వ్ ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. త‌న‌తో స‌న్నిహితంగా ఉండాల‌ని హింసిస్తున్నాడు. జులై 26వ తేదీన ఇంట్లో నుంచి యువ‌తిని బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు లాక్కొచ్చి దాడి చేశాడు. కొద్దిరోజుల క్రితం ఇంటిని కూడా ఖాళీ చేయించాడు. 

మ‌ళ్లీ ఆగ‌స్టు 7వ తేదీన రాత్రి స‌ద‌రు యువ‌తి మార్కెట్ నుంచి త‌న ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా అనూప్ యాద‌వ్ అడ్డుకుని అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు ఇటీవ‌లే గోవింద్ న‌గ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. స్టేష‌న్ లో త‌న ముందు డ్యాన్స్ చేస్తేనే కేసు న‌మోదు చేస్తాన‌ని ఎస్ఐ అన్నాడు. దీనిపై గోవింద్ న‌గ‌ర్ స‌ర్కిల్ ఆఫీస‌ర్ ను బాధితురాలి త‌ల్లి ఆశ్ర‌యించ‌గా.. ఆయ‌న కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అనూప్ యాద‌వ్‌పై కేసు న‌మోదు చేయ‌లేదు. 


logo