మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 15:53:40

బాలుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు

బాలుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు

న్యూఢిల్లీ: వాయవ్య ఢిల్లీలో ఇద్దరు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నది. మద్యం పార్టీ డబ్బు చెల్లించడంపై ఇరువురి మధ్య గొడవ జరిగి తుపాకీ కాల్పులకు దారితీసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్ పూర్ లో నివాసముంటున్న ముగ్గురు మద్యం పార్టీ చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే డబ్బు ఎవరు చెల్లించాలనే దానిపై పీటముడి వీడక ఘర్షణ పెద్దదిగా మారింది. దాంతో 22 ఏండ్ల యువకుడు కోపంతో తన వద్ద ఉన్న తుపాకీ తీసి 17 ఏండ్ల బాలుడిపైకాల్పులు జరిపాడు. దాంతో బాలుడి ఛాతిలోకి ఒక బుల్లెట్ దిగింది. స్థానికులు బాలుడిని దగ్గర్లోని దవాఖానకు తరలించగా.. అక్కడ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పార్టీ డబ్బులు చెల్లించే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో యువకుడు తుపాకీతో కాల్చాడని మద్యం పార్టీకి వచ్చిన మరో యువకుడు పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు యువకుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పట్టుబడిన యువకుడు మద్యం సేవించినట్లుగా నిరూపనకాలేదు. నిందితుడిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య), ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.


logo