శుక్రవారం 15 జనవరి 2021
Crime - Oct 16, 2020 , 19:28:20

పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు

పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు

రాజన్న సిరిసిల్ల : జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్, బైపాస్ శివారులో పేకాట స్థావరాలపై శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వీరి నుంచి రూ.5,600 నగదుతోపాటు 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్‌నగర్‌, బైపాస్‌ శివారులో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొందరు పేకాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఉదయం టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పట్టుబడిన నిందితులను సిరిసిల్ల పోలీసులకు అప్పగించారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్, ఆర్ఐ (అడ్మిన్) సంపత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.