శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 15, 2020 , 20:59:42

ఖమ్మంలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

ఖమ్మంలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

ఖమ్మం : జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం నిర్వహించిన దాడుల్లో పీడీఎస్‌ బియ్యంతో పాటు నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావ్‌ తెలిపారు. బోనకల్లు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మధిర క్రాస్‌రోడ్డు వద్ద రెండు ఆటోల్లో 13క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా టాన్‌ఫోర్స్‌ ఎస్‌ఐ రఘు సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు కార్తి, గోపయ్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే ఖానాపురం హవేలీ స్టేషన్‌ పరిధిలో శ్రీనివాసరావు అనే వ్యక్తి నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు తనిఖీలు చేసి, రూ.62వేల విలువైన ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, సదరు వ్యక్తిని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. దాడుల్లో ఎస్‌ఐ రఘు, కానిస్టేబుల్‌ రామకృష్ణ, రవి పాల్గొన్నారు.


logo