శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 19, 2020 , 20:38:41

సోష‌ల్ ‌మీడియాలో భార్య న‌గ్న‌చిత్రాలు

సోష‌ల్ ‌మీడియాలో భార్య న‌గ్న‌చిత్రాలు

  • వ‌ర‌క‌ట్నం కోసం ఓ భ‌ర్త అరాచ‌కం

చెన్నై: భార్య‌ల మీద క‌క్ష తీర్చుకోవ‌డం కోసం సోష‌ల్ ‌మీడియాను వేదిక‌గా చేసుకునే శాడిస్టు భ‌ర్త‌ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. కార‌ణం ఏదైనా సోష‌ల్ మీడియాలో భార్య‌ల ప‌రువు తీయడం అలాంటి భ‌ర్త‌ల‌కు కామ‌న్ అయిపోయింది. రెండు రోజుల క్రితం హ‌ర్యానాలో ఓ భ‌ర్త త‌న భార్య న‌గ్న చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే.. శ‌నివారం అలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌మిళ‌నాడుకు చెందిన ఓ వ్య‌క్తి.. భార్య వ‌ర‌క‌ట్నం ఇవ్వ‌లేద‌న్న‌ కోపంతో ఆమె ప్రైవేట్‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడు రాష్ట్రం తిరువొత్రియూర్‌కు చెందిన విజ‌య‌భార‌తి (29) ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగి. గ‌త జ‌న‌వ‌రిలో త‌మిళ‌నాడుకే చెందిన‌ ఓ యువ‌తిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్న ఇద్ద‌రికి ఆ త‌ర్వాత వ‌ర‌క‌ట్నం విష‌య‌మై గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. పెండ్లి స‌మ‌యంలో ఇస్తాన‌న్న రూ.10 ల‌క్ష‌లు ఇవ్వ‌డం లేద‌ని ఆమెను వేధించ‌డం మొద‌లుపెట్టాడు. ఇదే విష‌య‌మై ప‌లుమార్లు ఆమెపై చేయికూడా చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో బాధితురాలు త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. 

దీంతో ఆమెపై మ‌రింత ప‌గ‌పెంచుకున్న విజ‌య‌భార‌తి.. త‌న ద‌గ్గ‌రున్న ఆమె ప్రైవేట్ ఫొటోల‌ను ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ ఫొటోలను గ‌మ‌నించిన బాధిత‌ యువ‌తి విల్లివ‌క్కం మ‌హిళా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న నిందితుడు విజ‌య‌భార‌తిని అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా, బాధితురాలికి అంత‌కుముందు కూడా మ‌రో వ్య‌క్తితో వివాహం జ‌రిగింది. అయితే, అత‌నితో కూడా గొడ‌వ‌లు రావ‌డంతో విడిపోయి విజ‌య‌భార‌తిని రెండో వివాహం చేసుకుంది.  ‌        ‌    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo