గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 31, 2020 , 18:33:37

ఉద్యోగం కోసం దేవుడికి మొక్కి.. ప్రాణాలు తీసుకున్న వ్యక్తి

ఉద్యోగం కోసం దేవుడికి మొక్కి.. ప్రాణాలు తీసుకున్న వ్యక్తి

చెన్నై: ఉద్యోగం వస్తే తన ప్రాణాలు అర్పిస్తానని ఓ వ్యక్తి దేవుడికి మొక్కుకున్నాడు. ఇటీవల అతడికి బ్యాంకు ఉద్యోగం రావడంతో విధుల్లో చేరిన పక్షం రోజుల్లో ఆ మేరకు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వింత ఘటన తమిళనాడులో జరిగింది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు చెందిన 32 ఏండ్ల నవీన్‌కు చాలా కాలంగా ఉద్యోగం రాక విసిగిపోయాడు. దీంతో నిరాశ చెంది దేవుడికి వింత మొక్కు మొక్కాడు. ఉద్యోగం వస్తే తన ప్రాణాలు అర్పించి దేవుడిలో ఐక్యం అవుతానని ప్రార్థించాడు. అయితే ఇటీవల నవీన్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. దీంతో ముంబైలోని ఆ బ్రాంచ్‌ శాఖలో విధుల్లో చేరాడు. అనంతరం అతడికి తాను దేవుడికి ఇచ్చిన మొక్కు గుర్తుకు వచ్చింది. 

దీంతో 15 రోజులు విధుల తర్వాత నవీన్‌ కేరళలోని తిరువనంతపురానికి శుక్రవారం విమానంలో చేరుకున్నాడు. అక్కడి నుంచి నాగర్‌కోయిల్‌ వచ్చాడు. అనంతరం రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైలు పట్టాలపై పడుకున్నాడు. రైలు అతడిమీదగా వెళ్లడంతో మరణించాడు. ఉద్యోగం వస్తే దేవుడి వద్దకు వస్తానని తాను ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నవీన్‌ రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నవీన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక మరేదైనా కారణం ఉన్నదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.