శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 15:16:14

ప్రాణం తీసిన ఈత సరదా..బావిలో పడి యువకుడి మృతి

ప్రాణం తీసిన ఈత సరదా..బావిలో పడి యువకుడి మృతి

ఆదిలాబాద్ : ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని ఉట్నూర్ మండలం హస్నాపూర్ లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏడుగురు యువకులు కలిసి గ్రామ సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టడం కోసం వెళ్లారు.

ఈతరాని షేక్ దాదు అనే యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతయ్యాడు. మిగాతా ఆరుగురు బయటకు వచ్చి ఈ విషయాన్ని స్థానికులకు చేరవేశారు. పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహాన్నివెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


logo