శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 11:14:52

కరోనా పేషంట్‌పై స్వీపర్‌ లైంగిక వేధింపులు

కరోనా పేషంట్‌పై స్వీపర్‌ లైంగిక వేధింపులు

రాయపూర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తొమ్మిదేండ్ల మైనర్‌పై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన రాయ్‌పూర్‌లోని  ఓ ప్రైవేట్ దవాఖానలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ తొమ్మిదేండ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమెను ఖమ్తరై పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్‌ దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కరోనా చికిత్సా కేంద్రానికి తరలించారు.

ఆగస్టు 2న బాధితురాలు దవాఖానలో చేరగా అప్పటి నుంచి  కన్హైలాల్ నిషాద్ (45) అనే స్వీపర్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. గురువారం ఉదయం బాలిక పళ్లు తోముకోవడానికని వాష్‌రూమ్‌కు వెళ్లగా స్వీపర్‌ ఆమె వెంట వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దవాఖానకు చేరుకొని స్వీపర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణ అనంతరం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు రాయపూర్‌ సీనియర్‌ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo