శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 21, 2020 , 15:06:20

ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

వికారాబాద్ : ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. జిల్లాలోని దారూర్ మండలం హరిదాస్పల్లి కి చెందిన  సాయిరెడ్డి, నాగేంద్రమ్మ దంపతుల ఒక్కగానొక్క కమారుడు హరిశివశంకర్ రెడ్డి ఎంఎస్ చదివేందుకు ఆస్టేలియా వెళ్లాడు. కాగా, తన రూంలో ఉన్నప్పుడు బాత్రూమ్ కు వెళ్లి అక్కడే పడిపోయాడు. తోటి మిత్రులు దవాఖానకు తరలించారు. అక్కడ ఉండే ప్రవాస భారతీయులు మైరుగైన వైద్యంస కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో హరిశివశంకర్ రెడ్డి మృతి చెందాడు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 


logo