శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 17:11:14

మైన‌ర్ బాలిక అనుమానాస్ప‌ద మృతి.. హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా?

మైన‌ర్ బాలిక అనుమానాస్ప‌ద మృతి.. హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా?

లఖింపూర్ ఖిరి : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖిరిలో 14 ఏండ్ల బాలిక ఆదివారం ఉద‌యం అనుమానాస్ప‌ద‌ స్థితిలో మృతి చెంది ఉంది. స‌మాచారం అందుకున్న లఖింపూర్ ఖిరి ఎస్పీ సతేంద్ర కుమార్ సింగ్, అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్, మితౌలి సర్కిల్ ఆఫీసర్ శితాన్షు కుమార్ ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి కండువాతో బాలిక దూలానికి ఉరి వేసుకుని మృతి చెందిన‌ట్లు గుర్తించారు. ఎవ‌రైనా చంపి మృత‌దేహాన్ని వేలాడ దీశారా? లేక బాలిక ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుందా? అనేది తెలియాల్సి ఉంద‌ని ఎస్పీ తెలిపారు. 

బాలిక మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించి, కుటుంబ స‌భ్యులు, బంధువులు, చుట్టు ప‌క్క‌ల వారిని విచారిస్తున్నామ‌ని ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన త‌రువాత దర్యాప్తు ప్రారంభిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo