ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 09:42:04

మద్యం తాగి విధులు నిర్వహించిన పోలీసుల సస్పెండ్‌

మద్యం తాగి విధులు నిర్వహించిన పోలీసుల సస్పెండ్‌

సూర్యాపేట: మద్యం సేవించి విధులు నిర్వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, డ్రైవర్‌ను జిల్లా పోలీసు అధికారులు '‌ చేశారు.

నాలుగు రోజుల క్రితం జిల్లా ఎస్పీ భాస్కరన్‌  హుజుర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మార్గమధ్యంలో ఉన్న పెన్‌పహాడ్ మండల పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆగారు. అక్కడ తప్పతాగి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు పి.లింగయ్య, ఎస్‌.శ్రీరాములు, హోంగార్డు జానకీ రాములు, డ్రైవర్‌ అలిముద్దీన్‌ను గమనించి బ్రీత్‌ ఎనలైజర్‌తో వారిని పరీక్షించారు.

వీరు సేవించిన ఆల్కహాల్‌ పర్సంటేజ్‌ అధిక మొత్తంలో ఉండడంతో పరీక్షలో తేలిన రిపోర్టు ఆధారంగా నలుగురిని సస్ఫెన్సన్‌‌ చేసినట్లు ఎస్పీ భాస్కరన్‌ వెల్లడించారు. logo