బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 13, 2020 , 17:03:07

మ‌రో మ‌హిళ‌తో భ‌ర్త‌.. న‌డిరోడ్డుపై ప‌ట్టుకున్న‌ భార్య‌.. వీడియో

మ‌రో మ‌హిళ‌తో భ‌ర్త‌.. న‌డిరోడ్డుపై ప‌ట్టుకున్న‌ భార్య‌.. వీడియో

ముంబై : ఓ వ్య‌క్తి మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న భార్య‌.. వారిద్ద‌రిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో త‌న భ‌ర్త‌పై నిఘా పెట్టి.. కారులో వెళ్తున్న ఇద్ద‌రిని న‌డిరోడ్డుపై ప‌ట్టుకుని నిల‌దీసింది. ఈ ఘ‌ట‌న ముంబైలోని పెడెర్ రోడ్డులో శ‌నివారం సాయంత్రం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ముంబైకి చెందిన ఓ మ‌హిళ‌.. త‌న భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేసింది. ఆమె అనుమానం నిజ‌మైంది. శ‌నివారం రోజు త‌న భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్ల‌గా ఆయ‌న రేంజ్ రోవ‌ర్ కారును అనుస‌రించింది. ఓ మ‌హిళ‌ను ఎక్కించుకుని వెళ్తుండ‌గా.. పెడెర్ రోడ్డులో ప‌ట్టుకుంది. మ‌హిళ త‌న కారును ఆపి.. రేంజ్ రోవ‌ర్ కు అడ్డుగా వెళ్లి నిల్చుంది.

ఆగ్ర‌హంతో త‌న చెప్పు తీసుకుని కారుపైకి విసిరింది. బ‌య‌ట‌కు రావాల‌ని డిమాండ్ చేసింది. వారు ఎంత‌కు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో కారు బోనెట్ పై కూర్చుంది. దీంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వ‌చ్చి ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ట్రాఫిక్ కు అంత‌రాయం క‌లిగించినందుకు మ‌హిళ‌కు పోలీసులు చ‌లాన్ జారీ చేశారు. 


logo