ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 20:42:44

సుశాంత్‌ మరణ కేసు.. ‘మహా’ హోం మంత్రిని కలిసిన పోలీస్ కమిషనర్

సుశాంత్‌ మరణ కేసు.. ‘మహా’ హోం మంత్రిని కలిసిన పోలీస్ కమిషనర్

ముంబై : బాలివుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుకు సంబంధించి మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌తో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ముంబై పోలీస్‌ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ గురువారం మంత్రాలయ చేరుకున్నారు. ఆగస్టు 19న సుశాంత్‌ మరణంపై పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్ చట్టబద్ధమైందని పేర్కొంటూ ఈ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన అన్ని ఆధారాలను సీబీఐకు అప్పగించాలని సుప్రీం కోర్టు ముంబై పోలీసులను కోరింది. ఈ ఉత్తర్వులను సవాలు చేసే అవకాశాన్ని మహారాష్ట్ర నిరాకరించిందని జస్టిస్ రాయ్ అన్నారు. పాట్నా నుంచి దర్యాప్తును బదిలీ చేయమని బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించడంతో సుశాంత్‌ మరణానికి సంబంధించి రియా చక్రవర్తి, ఇతరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo