గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 19, 2020 , 10:41:02

నిద్రట్లోనే తెల్లారిన బతుకులు.. మట్టి ఇల్లు కూలి ముగ్గురు మృతి

నిద్రట్లోనే తెల్లారిన బతుకులు.. మట్టి ఇల్లు కూలి ముగ్గురు మృతి

మహబూబ్ నగర్ : పొద్దంత కాయకష్టం చేసి అలసిపోయి నిద్రిస్తున్న వారి బతుకులు నిద్రట్లోనే తెల్లారాయి. ఎండా, వాన నుంచి కాపాడుతుందనుకున్న ఇల్లే వారి పాలిట మృత్యువైంది. మట్టి ఇల్లు కూలడంతో తల్లీ, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శరణమ్మ (38), భవాని(13), వైశాలి (9) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు.

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాత మట్టి ఇల్లు కూలి తల్లీ, కూతుళ్లు మృతి చెందారు. భర్త మల్లేష్, కుమారుడు ఆరుబయట నిద్రిస్తుండడంతో  ప్రాణాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది. 


logo