శనివారం 23 జనవరి 2021
Crime - Oct 05, 2020 , 16:13:43

సర్వే పకడ్బందీగా చేపట్టాలి : రఘనందన్ రావు

సర్వే పకడ్బందీగా చేపట్టాలి  : రఘనందన్ రావు

యాదాద్రి భువనగిరి : గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వేలో ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ రఘనందన్ రావు అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంతో పాటు గూడూరు గ్రామంలో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ అనితారాంచంద్రన్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయించాలని కలెక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా అగర్వాల్, అదనపు కలెక్టర్ కిమ్యానాయక్, డీఈవో సాయిబాబా, తహసీల్దార్ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి పాల్గొన్నారు.


logo