ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 19:03:28

నిషేధిత సిగరెట్లు సరఫరా.. వ్యక్తి అరెస్టు

నిషేధిత సిగరెట్లు సరఫరా.. వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ : నిషేధిత సిగరెట్లను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సందీప్‌ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి నిషేధిత సిగరెట్లు తీసుకొచ్చి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. నగరంలోని జిమ్మేరాత్‌ బజార్‌లోని గోదాంలో సిగరెట్లను నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రైడ్‌ చేసి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సిగరెట్ల విలువ రూ. 16 లక్షలుగా సమాచారం. 


logo