బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 13:53:49

ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఇంటి నుంచి ఆత్మాహుతి జాకెట్, పేలుడు సామగ్రి స్వాధీనం

ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఇంటి నుంచి ఆత్మాహుతి జాకెట్, పేలుడు సామగ్రి స్వాధీనం

లక్నో: ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ముహమ్మద్ ముస్తాకీమ్ అలియాస్ యూసుఫ్ అలియాస్ అబూ యూసుఫ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ బల్రాంపూర్ జిల్లాలోని అతడి ఇంటి నుంచి ఆత్మాహుతి జాకెట్ తోపాటు భారీగా పేలుగు పదార్థాలను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐఎస్ నల్ల జెండాతోపాటు కొన్ని పత్రాలు కూడా లభించాయి. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ధౌలా కువాన్ ప్రాంతంలోని ఓ ఇంటిపై రైడ్ చేసిన పోలీసులు కొంత కాల్పుల తర్వాత యుసఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ప్రెజర్ కుక్కర్ ఐఈడీలు, 15 కిలోల పేలుడు పదార్థాలు, ఒక తుపాకీ, మందుగుండును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని నిందితుడి గ్రామంలో తనిఖీలు చేశారు. బాంబులున్న ఆత్మాహుతి జాకెట్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక శ్మశాన వాటికలో ఐఈడీలను అతడు పరీక్షించినట్లు గుర్తించారు. వాడకానికి సిద్ధంగా ఉన్న ఐఈడీలను బాంబు స్క్వాడ్ సిబ్బంది నిర్వీర్యం చేశారు. ఎన్‌ఎస్‌జీ కమాండోలు, బాంబు స్క్వాడ్ సిబ్బంది ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

మరోవైపు తన కుమారుడు ఇంటిలో బాంబులు ఉంచిన విషయం తనకు తెలియదని యూసఫ్ తండ్రి కఫీల్ అహ్మద్ తెలిపారు. అతడి కార్యకలాపాల గురించి తెలిసి ఉంటే ఇంట్లో నుంచి పంపించివేసి ఉండేవాడినని చెప్పారు. కాగా తన భర్త ఇంట్లో బాంబులు దాచాడని, ఇలా చేయవద్దని తాను చెప్పినా వినలేదని బాలరామ్‌పూర్‌లోని యూసఫ్ భార్య తెలిపారు. తమకు నలుగురు పిల్లలున్నారని, ఒక్కసారికి తన భర్తను క్షమించాలని మీడియాతో ఆమె అన్నారు.
 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo