మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 31, 2020 , 17:33:15

ఖమ్మం జిల్లాలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఖమ్మం : జిల్లాలోని చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి వృద్ధ దంపతులు నాగయ్య (75 )నారాయణమ్మ (70) అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా మృతి చెందారని  తెలిపారు. 

మృతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వారు వేరు వేరు ప్రాంతాల్లో స్థిర పడ్డారు. అనారోగ్యంతో ఎవరికి భారంగా ఉండకూడదని భావించిన ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo