ప్రేమించిన యువతితో గొడవ.. యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ : ప్రేమించిన యువతి జరిగిన గొడవ.. చివరకు మాట్లాడడం మానేడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అల్వాల్‌లో సోమవారం చోటుచేసుకుంది. చిలుకలగూడకు చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సికింద్రాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న అల్వాల్‌కు చెందిన యువతితో కొద్ది నెలల కిందట ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. వంశీకృష్ణ ఆ యువతి చిత్రాన్ని తన గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య ఆదివారం గొడవ జరిగింది.
దీంతో యువతి వంశీకృష్ణతో మాట్లాడడం మానేసింది. దీంతో ప్రియురాలు తనతో మాట్లాడడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైన వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమం ఆదివారం రాత్రి బాలాజీనగర్‌లోని తన స్నేహితులతో గడిపాడు. అనంతరం తిరిగి ఇంటికి చేరాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి భూదేవి నగర్ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- భారత్‌కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
- కనకరాజును సన్మానించిన జడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్‌గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్‌పథ్‌లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల