మంగళవారం 02 జూన్ 2020
Crime - Mar 02, 2020 , 07:15:10

కుటుంబంతో సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య..

కుటుంబంతో సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య..

హైదరాబాద్‌: నగరంలోని హస్తినాపురంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు చూసినైట్లెతే.. ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్‌, స్వాతి దంపతులు.. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో నివాసముంటున్నారు. ప్రదీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు.. కళ్యాణ్‌(6), జయకృష్ణ(2) ఉన్నారు. కాగా, కొన్ని నెలలుగా ప్రదీప్‌ కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేని ప్రదీప్‌ దంపతులు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తాము మరణిస్తే.. తమ కుమారులు అనాథలవుతారని భావించి, వారిని కూడా ఆత్మహత్యలో భాగం చేశారు. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన ఇంటి యజమాని, విషయాన్ని స్థానికులకు, పోలీసులకు తెలియజేశారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహించారు. అనంతరం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం.. మార్చురీకి తరలించారు. ప్రదీప్‌ కుటుంబం ఆత్మహత్య విషయాన్ని వారి కుటుంబీలకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 


logo