గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 27, 2020 , 18:11:11

టీచర్ల ఫొటోలు మార్ఫింగ్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన స్టూడెంట్స్‌

టీచర్ల ఫొటోలు మార్ఫింగ్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన స్టూడెంట్స్‌

గోవా : గోవా రాజధాని పనాజీలోని పాంజిమ్‌ ప్రాంతంలో విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పే టీచర్ల ఫొటోలు తీసి, వాటికి అవమానకర రాతలు జత చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. గమనించిన స్కూల్‌ యాజమాన్యం స్టూడెంట్ల చర్యలకు కంగు తినింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

‘ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతున్న టీచర్ల ఫొటోలను స్క్రీన్‌ షాట్లు కొట్టి వాటిని మార్ఫింగ్‌ చేసి తిడుతూ సోషల్‌ మీడియాలో పెట్టారు. స్కూల్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని’ఎస్పీ పంకజ్‌కుమార్‌ పేర్కొన్నారు. 


logo