శుక్రవారం 30 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 18:48:18

బైక్ నంబ‌ర్‌ప్లేట్ ఫేస్ మాస్క్‌తో క‌వ‌ర్.. విద్యార్థి ప‌ట్టివేత‌

బైక్ నంబ‌ర్‌ప్లేట్ ఫేస్ మాస్క్‌తో క‌వ‌ర్.. విద్యార్థి ప‌ట్టివేత‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలో ట్రాఫిక్ పోలీసుల నుండి త‌ప్పించుకునేందుకు బైక‌ర్లు వినూత్న మార్గాల‌ను అన్వేసిస్తుంటారు. ప్ర‌ధాన ర‌హ‌దారుల నుండి కాకుండా గ‌ల్లీల్లోంచి వెళ్ల‌డం, పోలీసుల త‌నిఖీల గురించి మేసేజ్‌ల రూపంలో తెలుసుకోవ‌డం ఇలా అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇటువంటి ఓ మార్గాన్నే అమ‌లుచేసిన ఓ విద్యార్థి మొత్తంమీద పోలీసుల‌కు చిక్కాడు. ట్రాఫిక్ చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తూ బైక్ నంబ‌ర్ క‌నిపించ‌కుండా ఫేస్ మాస్క్‌ను రిజిస్ర్టేష‌న్ ప్లేట్‌పై ఉంచాడు. త‌నిఖీల్లో గుర్తించిన పంజాగుట్ట పోలీసులు విద్యార్థి స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ఖాన్‌ను ప‌ట్టుకున్నారు. పంజాగుట్ట ఏ1 హోట‌ల్ వ‌ద్ద ట్రాఫిక్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ పి.రామ‌కృష్ణ వాహ‌న త‌నిఖీలు చేప‌ట్టాడు. ఆ స‌మ‌యంలో నెంబ‌ర్ ప్లేట్ క‌నిపించ‌కుండా ఉన్న స‌ర్ఫ‌రాజ్ బైక్‌ను గుర్తించారు. చెక్ చేయ‌గా అప్ప‌టికే రూ. 800 విలువ గ‌ల‌ నాలుగు పెండింగ్ చాల‌న్లు ఉన్నాయి. నిందితుడిపై సెక్ష‌న్ 420, 511 కింద కేసు న‌మోదు చేశారు. బైక్‌ను పంజాగుట్ట లా అండ్ ఆర్డ‌ర్ పోలీసుల‌కు అప్ప‌గించారు.