సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 13:27:50

రోడ్డు ప్ర‌మాదంలో విద్యార్థి కాలు తెగిప‌డిన వైనం

రోడ్డు ప్ర‌మాదంలో విద్యార్థి కాలు తెగిప‌డిన వైనం

హైద‌రాబాద్ : రోడ్డు ప్ర‌మాదంలో ఓ విద్యార్థి త‌న కాలును కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న న‌గ‌రంలోని గోల్నాక వ‌ద్ద గ‌డిచిన రాత్రి చోటుచేసుకుంది. అంబ‌ర్‌పేట‌కు చెందిన ర‌జ‌త్‌(19) అనే విద్యార్థి డిగ్రీ చ‌దువుతున్నాడు. ట్యాంక్‌బండ్‌పై వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నాన్ని చూసేందుకు బైక్‌పై స్నేహితుడితో క‌లిసి వెళ్లాడు. రాత్రి స‌మ‌యంలో ఇరువురు తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. గోల్నాక వ‌ద్ద‌కు చేరుకునే స‌రికి ర‌జ‌త్ కంట్రోల్ కోల్పోయి రోడ్డుప్ర‌క్క‌గా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్ర‌మాదంలో త‌న కుడి కాలులోని కొంత‌భాగం తెగిప‌డింది. మ‌రో వ్య‌క్తి స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు కాచిగూడ ఎస్‌హెచ్‌వో హ‌బీబుద్దీన్ ఖాన్ తెలిపారు. కేసు న‌మోదు చేసిన‌ట్లు ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు. 


logo