సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 20:33:24

స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

కడలూరు : తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడానికి నిరాకరించడంతో తమిళనాడు రాష్ర్టం కడలూరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కడలూరుకు చెందిన విఘ్నేశ్‌ అనే విద్యార్థి స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతుండడంతో తనకు స్మార్ట్‌ఫోన్‌ కావాలని తల్లిదండ్రులను కోరాడు. వారు ఇప్పడు కాదు కొన్ని రోజుల తరువాత కొనిస్తామని చెప్పగా.. పదే పదే ఫోన్‌ కావాలని మారం చేసేవాడు. తల్లిదండ్రులు కుదరదని విసుక్కోవడంతో మనస్థాపానికి గురైన విఘ్నేశ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo