మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 10, 2020 , 21:30:49

పబ్జిగేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

పబ్జిగేమ్‌కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

కులకచర్ల : పబ్జిగేమ్‌కు అలవాటుపడిన యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్లలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన ఉప్పరి ఓంకార్‌(15) మొబైల్‌ఫోన్‌ కొనియాల్సిందిగా తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించని కారణంగా నిరాకరించారు. ఇంటికి సహాయంగా ఉంటూ ఉన్న పండ్ల దుకాణాన్ని చూసుకోవాల్సిందిగా సూచిస్తూ తండ్రి.. కొడును మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఓంకార్‌ ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఎక్కువగా మొబైల్‌ ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ ఉండేవాడన్నారు. ఫోన్‌ కొనేందుకు రూ.15 వేలు అడిగితే ఇవ్వకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తండ్రి పేర్కొన్నాడు.