మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 14:47:42

ఆడశిశువు మృతదేహాన్ని లాక్కెళ్లిన వీధి కుక్క.. కేసు నమోదు

ఆడశిశువు మృతదేహాన్ని లాక్కెళ్లిన వీధి కుక్క.. కేసు నమోదు

హైదరాబాద్ : ఓ ఆడశిశువు మృతదేహాన్ని వీధి కుక్క తీసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు చూసి కుక్కను గద్దాయించడంతో పసికందును వదిలేసి పారిపోయింది. ఈ ఘటన శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఎల్‌బీనగర్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాలు.. భరత్‌రెడ్డి అనే యువకుడు అతడి స్నేహితుడు నితిన్‌కుమార్‌తో కలిసి బైక్‌పై నాగోల్‌ నుంచి బీఎన్‌రెడ్డి అల్మాస్‌ గూడ వైపునకు వెళ్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ వీధికుక్క మృత ఆడశిశువును నోట్లో కరుచుకొని వెళ్తుండడాన్ని గమనించారు. వెంటనే ఇద్దరు యువకులు బైక్‌ దిగి అరవడంతో కుక్క పసికందు మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పారిపోయింది. భరత్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృత శిశువును ఉస్మానియా దవాఖానకు తరలించారు. 

శిశువు మృతదేహాన్ని ఎవరో పడేస్తే దాన్ని కుక్కలు లాక్కెళ్లి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని ఆ ప్రాంతం సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo