e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home క్రైమ్‌ శిశివు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి నోటకరుచుకెళ్లిన కుక్క

శిశివు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి నోటకరుచుకెళ్లిన కుక్క

శిశివు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి నోటకరుచుకెళ్లిన కుక్క

భువనేశ్వర్‌: శిశువు మృతదేహాన్ని వీధి కుక్క ఆసుపత్రి నుంచి నోటకరుచుకెళ్లింది. గమనించిన కొందరు దానిని వెంబడించగా ఆడ శిశివు మృతదేహాన్ని వదిలి వెళ్లింది. ఒడిశాలోని భద్రక్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుప్రతిలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఒక కుక్క నవజాత శిశువు మృతదేహాన్ని నొటకరుచుకుని ఆసుపత్రిలో తిరుగసాగింది. గమనించిన కొందరు దానిని వెంబడించడంతో ఆడ శిశువు మృతదేహాన్ని వదిలి పారిపోయింది. 

మరోవైపు ఈ ఘటనపై ఆసుపత్రిలోని కొందరు మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. అయితే నెలలు నిండని ఆడ శిశువు మృతదేహాం ఎక్కడి నుంచి వచ్చిందో తమకు తెలియదని జిల్లా ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. కాగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శిశివు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి నోటకరుచుకెళ్లిన కుక్క

ట్రెండింగ్‌

Advertisement