గురువారం 21 జనవరి 2021
Crime - Jan 04, 2021 , 22:03:16

సీఐ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌.. డబ్బులు డిమాండ్‌

సీఐ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌.. డబ్బులు డిమాండ్‌

హైదరాబాద్‌ : సైబర్‌ నేరగాళ్లు ఎన్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులు ఫేస్‌బుక్‌ ఖాతాను హాక్‌ చేశారు. ఆయన పేరుతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ జాబితాలో ఉన్న వారిని మెసెంజర్‌లో డబ్బు పంపాలని హ్యాకర్లు కోరారు. ఈ విషయం తెలిసిన  మిత్రులు వెంటనే సీఐ సైదులును అప్రమత్తం చేశారు. సీఐ సైబర్‌ పోలీసులుకు సమాచారం అందించారు. సైబర్‌ పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు. తన పేరుతో ఫేస్‌బుక్ ద్వారా‌ ఎవరూ డబ్బులు పంపాలని కోరినా స్పందించవద్దని ఈ సందర్భంగా సీఐ సైదులు కోరారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo