శనివారం 06 మార్చి 2021
Crime - Jan 20, 2021 , 20:42:20

‘ఓటిటి రిలీజ్‌పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’

‘ఓటిటి రిలీజ్‌పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’

కరోనా సమయంలో థియేటర్స్ మూత పడటంతో మన ప్రేక్షకులు ఓటిటికి బాగానే అలవాటు పడిపోయారు. ఒరిజినల్ ప్రింట్ నేరుగా రిలీజ్ చేస్తే వర్కవుట్ ఎలా అవుతుంది అనుకున్నారంతా. కానీ అలాంటి సమయంలో ఓటిటి వచ్చింది..  అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అందరి ఇళ్లలోకి వచ్చేసింది ఓటిటి. అయితే ఓటిటి రిలీజ్‌లు కొందరు నిర్మాతలకు అస్సలు నచ్చడం లేదు. వాళ్లు ఇప్పటికీ ఓటిటి విడుదలకు విరుద్ధంగానే ఉన్నారు. 

నేరుగా థియేటర్స్‌లో విడుదల చేయడానికి.. ఓటిటిలో తీసుకురావడానికి చాలా తేడా ఉందంటున్నారు. దీనిపై సీనియర్ నిర్మాత స్రవంతి రవికిషోర్ కూడా స్పందించాడు. ఈయన తాజాగా రామ్ పోతినేనితో రెడ్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్లనే తీసుకొస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలంటూ చాలా మంది మంచి ఆఫర్స్ ఇచ్చారని చెప్పాడు రవికిషోర్. కానీ థియేటర్స్‌లో విడుదల చేయడానికే ఇన్నాళ్ల టైమ్ తీసుకున్నామని చెప్పాడు ఈయన. 


రెడ్ సినిమా మేం తీసింది ప్రేక్షకుల కోసం.. థియేటర్స్‌లో విడుదల చేయడం కోసమే అని చెప్పాడు ఈయన. అంతేకాదు తమ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని. అది మంచి వసూళ్లు తీసుకొస్తుందని ముందు నుంచి కూడా నమ్మకం ఉందని చెప్పాడు స్రవంతి రవికిషోర్. తమ సినిమాతో అందరికీ థియేట్రికల్ అనుభవం ఇవ్వాలని అనుకున్నామని.. అందుకే అన్ని నెలలు వేచి చూసి కూడా థియేటర్లలోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నామని చెప్పాడు ఈయన.

అందుకే ఓటీటీలో విడుదల చేయలేదని.. అయినా 10 రూపాయలు పెట్టుబడి పెడితే 12 రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్లు ఉన్నారు.. 10 రూపాయలకు 9 రూపాయలు వచ్చినా 12 రూపాయలు వచ్చినా ప్రేక్షకుడి నుంచే నేరుగా రావాలని తాను ఆలోచిస్తానని చెప్పాడు రవికిషోర్. అలాంటి నిర్మాతలం కొందరం ఉన్నామని.. తమకు సినిమా ఒక వ్యాపారం కాదని.. ప్రేక్షకులు సినిమాను చూడాలనేది తమ టార్గెట్ అంటున్నాడు ఈయన.

పెట్టుబడిపై ఎంతో కొంత లాభం వస్తే చాలు అనుకుని సినిమాను వ్యాపారంగా చూసేవాళ్లను మనం ప్రశ్నించలేం అంటున్నాడు ఈయన. కొందరు సినిమా తమకు ప్యాషన్ అని చెప్పి ఓటిటిలో విడుదల చేస్తున్నారని కొందరు నిర్మాతలపై ఆయన సెటైర్లు కూడా వేసాడు. మరి స్రవంతి రవికిషోర్ టార్గెట్ చేసిన నిర్మాత ఎవరై ఉంటారా అనేది ఆలోచిస్తున్నారంతా.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo