మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 13, 2020 , 03:05:14

ఆందోళన లేదు ఒలింపిక్స్‌ అర్హతపై హిమ దాస్‌

ఆందోళన లేదు ఒలింపిక్స్‌ అర్హతపై హిమ దాస్‌

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో తనకు ఎలాంటి ఆందోళన లేదని యువ స్ప్రింటర్‌ హిమ దాస్‌ అంది. కరోనా వైరస్‌  కారణంగా రానున్న కొన్ని రోజుల వరకు ఎలాంటి టోర్నీలు లేవని ప్రస్తుతం తన దృష్టంతా ఫిట్‌నెస్‌పైనే అని చెప్పుకొచ్చింది. పటియాలలో శిక్షణ తీసుకుంటున్న హిమ.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దినసరి ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆదివారం హిమ మీడియాతో పలు విషయాలను పంచుకుంది. ‘ప్రస్తుతానికైతే ఎలాంటి టోర్నీలు లేవు, కావున శిక్షణ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా. మరీ కఠిన, కింది స్థాయి గాకుండా.. మధ్యమరీతిలో ఉండే  శిక్షణ పద్ధతులు ఫాలో అవుతున్నాం. జీవితాన్ని సాధ్యమైనంత ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తాను. ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో నాకు ఎలాంటి ఆందోళన లేదు. దీని వల్ల టెన్షన్‌ పెంచుకోవడం తప్పా.. మరొకటి ఉండదు. విశ్వక్రీడలకు ఇంకా ఏడాది సమయముంది. ఈ మహమ్మారి సమ స్య తొందరగా దూరం కావాలని మనం ప్రార్థించాలి. గాయం నుంచి కోలుకుంటున్నాను. ఏఎఫ్‌ఐ వాళ్లు ఏ టోర్నీలో పోటీపడమంటే అందులో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా’ అని హిమదాస్‌ చెప్పుకొచ్చింది. logo