గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 11, 2020 , 17:43:17

బైక్‌ను ఢీకొని బాలుడి పైనుంచి దూసుకెళ్లిన ట్యాంకర్‌..

బైక్‌ను ఢీకొని బాలుడి పైనుంచి దూసుకెళ్లిన ట్యాంకర్‌..

చెన్నై: చెన్నై పట్టినాపక్కం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఉదయం ఎన్నోర్ నుంచి గోపాల్ అనే వ్యక్తి తన భార్యతోపాటు మనవడు ప్రాణేశ్‌ (4)తో బైక్‌పై తారామణి ప్రాంతానికి బయల్దేరాడు. పట్టినపక్కం వద్దకు రాగానే వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురూ రోడ్డుపై పడ్డారు.

బాలుడి పైనుంచి ట్యాంకర్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గోపాల్‌తోపాటు అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో మరో వాహనదారుడు సైతం గాయపడ్డాడు. ఘటనా స్థలం నుంచి ట్యాంకర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు రాయ్‌పేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రాఫిక్ సిగ్నల్‌ పడినా ట్యాంకర్ డ్రైవర్‌ నిలుపకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అడయార్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo