సోమవారం 25 జనవరి 2021
Crime - Nov 05, 2020 , 16:07:03

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం మ‌ధ్యాహ్నం ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవ‌డంతో.. అది ప‌ల్టీలు కొట్టింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. న‌డిరోడ్డుపై బోల్తా ప‌డ్డ కారును ట్రాఫిక్ పోలీసులు ప‌క్క‌కు నెట్టారు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ : టీఎస్ 13 ఈఎన్ 9788.


logo