శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 08:44:16

స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్‌ అధికారిపై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు స్పెషల్‌ బ్రాంచ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న చందర్‌కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు. దర్యాప్తు అనంతరం చందన్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎవరైనా వేధింపులకు గురి చేస్తే నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. వాట్సాప్‌ నంబర్‌కు 9490616555 మెస్సేజ్‌ చేయాలని కోరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo