ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 07, 2020 , 16:16:41

టీవీ ఆఫ్‌ చేయొద్దన్నందుకు తండ్రిని కాల్చిచంపిన కుమారుడు

టీవీ ఆఫ్‌ చేయొద్దన్నందుకు తండ్రిని కాల్చిచంపిన కుమారుడు

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. టీవీ ఆఫ్‌ చేయకపోవడంతో కోపోద్రుక్తుడైన కుమారుడు తండ్రిని తుపాకీతో కాల్చిచంపాడు. నసీర్‌పూర్‌ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన లాలరామ్‌ (80) కుమారుడు అశోక్‌ కటిహర్‌ సైన్యంలో పనిచేసి రిటైరయ్యాడు. నాటి నుంచి కుటుంబ సభ్యులతోపాటు తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు.

గురువారం అర్ధరాత్రి తండ్రి లాలరామ్‌ టీవీ చూస్తుండగా అశోక్‌ కటిహర్‌ టీవీని ఆఫ్‌ చేశాడు. తండ్రి తిరస్కరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రుక్తుడైన అశోక్‌ తండ్రిని తన లైసెన్స్‌ గన్‌తో కాల్చి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లాలరామ్‌ కాసేపటి తరువాత మృతి చెందాడు. కొంతకాలంగా అశోక్‌ మద్యానికి బానిసై చిన్నచిన్న గొడవల్లో తలదూరుస్తున్నాడని కుటుంబీకులు తెలిపారు. నిందితుడిపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగాలోకి దించామని ఏఎస్పీ అనూప్‌ కుమార్‌ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo