టాలీవుడ్ యాక్టర్ నాగార్జున లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్. ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఎన్ఐఏ అధికారి ఏసీపీ విజయ్ వర్మగా నటిస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు స్పెషల్ ప్రివ్యూను ఏర్పాటు చేశారు. అనంతరం ఘాజి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ..సీట్ థ్రిల్లర్. తెలుగు సినిమాలో రత్నంలాంటిది. మనందరం గర్వించదగ్గ సినిమా అవుతుంది.
క్షణం డైరెక్టర్ రవికాంత్ పేరెపు మాట్లాడుతూ..వైల్డ్ డాగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సినిమా సాగుతున్నంతసేపు నా చూపు పక్కకు తిప్పుకోలేకపోయాను. నాగార్జున సార్ లోని ఈ యాంగిల్‌ను ఎప్పుడూ చూడలేదు. నాగార్జున మరో స్థాయిలో కనిపిస్తారు. వైల్డ్ డాగ్ సీట్ యాక్షన్ సీక్వెన్స్ కు అంచున ఉంటుంది. ఔట్ ఆఫ్ బాక్స్ స్క్రిప్ట్ ఉంటుందని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్ జే అన్నాడు.