శనివారం 11 జూలై 2020
Crime - Jun 03, 2020 , 09:30:39

అంబంలో తండ్రిని చంపిన తనయుడు

అంబంలో తండ్రిని చంపిన తనయుడు

నిజామాబాద్‌ : జిల్లాలోని రుద్రూరు మండలం అంబం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తండ్రి గంగారాం(58)ను కొడుకు గంగాధర్‌ హత్య చేశాడు. కుటుంబ కలహాల కారణంగా రాత్రి పొలం వద్ద తండ్రిని తలపై కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గంగారాం రాత్రి పశువుల కొట్టం వద్ద నిద్రపోయాడు. ఆ సమయంలో కొడుకు గంగాధర్‌ వచ్చి కర్రతో తలపై దాడి చేసి హతమార్చాడు. తన భార్యతో తండ్రి అక్రమ సంబంధం కలిగిఉన్నట్లుగా అనుమానించాడు. అదేవిధంగా కొంత ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. దాడి అనంతరం గంగాధర్‌ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


logo