శనివారం 06 మార్చి 2021
Crime - Jan 22, 2021 , 21:03:58

కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు

కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు

యాదాద్రి భువనగిరి : నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని కడతేర్చాడు. అల్లారు ముద్దుగా గోరు ముద్దుల తినిపించిన ఆ మాతృమూర్తి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. పేగు బంధాన్ని మర్చిపోయి కన్న కొడుకే తల్లిని కొట్టి చంపిన విషాద సంఘటన బీబీనగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధనమ్మ అనే వృద్ధురాలు తన కుమారుడైన మల్లయ్యతో కలిసి జీవిస్తున్నది.

గురువారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన మల్లయ్యకు అన్నం పెట్టకపోవడంతో కోపంతో వృద్ధ తల్లిపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మల్లయ్యని మందలించి వెంటనే వృద్ధురాలిని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. తన తల్లి మృతికి కారణమైన మల్లయ్యపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వృద్ధురాలి కూతురు ఐలమ్మ పోలీసులను కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?

కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు 


VIDEOS

logo