మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 25, 2020 , 22:31:41

లక్నవరం సరస్సులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గల్లంతు

లక్నవరం సరస్సులో  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గల్లంతు

గోవిందరావుపేట(ములుగు): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు పర్యాటక ప్రాంతాన్ని తిలకించేందుకు వచ్చి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శుక్రవారం గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్న 18 మంది ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నం లక్నవరం సరస్సు సందర్శనకు వచ్చారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వుల్లూరి సుధాకర్‌(22) తోటి మిత్రులకు చెప్పకుండానే ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. సంఘటనా స్థలాన్ని పస్రా పోలీసులు సందర్శించి జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతదేహాన్ని వెలికితీసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 


logo