శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 15:15:46

దొంగతనానికని వెళ్లి మైనర్‌ బాలికపై లైంగికదాడి

దొంగతనానికని వెళ్లి మైనర్‌ బాలికపై లైంగికదాడి

న్యూ ఢిల్లీ : పశ్చిమ విహార్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి, ఆమెను చంపడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీకి చెందిన కృష్ణుడు నలుగురితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగించేవాడు. 2006లో కృష్ణుడు తన సహచరుల్లో ఒకరితో కలిసి దొంగతనానికని సుల్తాన్‌పురిలోని ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పుడు ఇంట్లో ఉన్న మహిళ శబ్ధం చేయడంతో ఆమెను ఇటుకతో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో కృష్ణను పోలీసులు అరెస్టు చేయగా కోర్టు జీవితఖైదు విధించింది. కానీ జైలు అధికారులు సత్ప్రవర్తన కారణంగా కృష్ణుడిని 2014లోనే విడుదల చేశారు.

ఇదిలా ఉండగా ఆగస్టు 4న కృష్ణుడు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లో కి ప్రవేశించాడు. అతను ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను చూసి మొదట ఆమెపై లైంగికదాడి చేశాడు. తరువాత ఆమెను చంపాలని కుట్టు మిషన్‌తో తలపై మోది, పదునైన యంత్రంతో పలుమార్లు దాడి చేశాడు. బాలిక రక్తపు మడుగులో పడిపోవడంతో అమ్మాయి చనిపోయిందని భావించి.. ఇంట్లో దొరికిన రూ.200 తీసుకొని పారిపోయాడు. 

అయితే, పోలీసులు 48 గంటల్లో మంగోల్‌పురిలో కృష్ణుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 2014లో జైలు నుంచి విడుదలైన తరువాత కృష్ణుడు తండ్రి వద్ద ఉండడానికి వెళ్లగా అందుకు అతడు నిరాకరించాడు. అప్పుడు అతను ఒక కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగించాడు. 2016లో కూడా కృష్ణుడిని దొంగతనాల కేసులో అరెస్టు చేసి 4 నెలల తర్వాత విడుదల చేశారు. అతడికి ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo