రాంచీ : గిరిజనుల హక్కుల కోసం పోరాడి బ్రిటిషర్ల చేతిలో చనిపోయిన బిర్సా ముండా కుటుంబీకులకు ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. స్కాలర్షిప్ కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయిందని బిర్సా ముండా ముని మనవరాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బిర్సా ముండా 121 వ వర్ధంతి సందర్భంగా మరోసారి తమ ధైన్యస్థితిని జార్ఖండ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రూపంలో విన్నవించారు.
గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, నేను బిర్సా ముండా వారసురాలినైన జౌని కుమారి ముండా. నేను ప్రస్తుతం ఖుంటిలోని బిర్సా కాలేజీలో బీఏ పార్ట్ -3 చదువుతున్నాను. ఉపాధ్యాయులు బిర్సా ఉద్యమం గురించి బోధిస్తున్నప్పుడు గర్వంగా ఉంటుంది. నేను బిర్సా ముండా ముని మనవరాలు అని ఎవరికీ చెప్పను. ఎందుకంటే మా పరిస్థితి చూసి ప్రజలు నిరాశ చెందుతారు. గిరిజన బాలిక చదువు కోసం స్కాలర్షిప్ ప్రయోజనం లభిస్తుందని విన్నాను. చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నాను. మూడు సార్లు తిరస్కరించడంతో ప్రయోజనం పొందలేకపోయాను.
అలాగే, నా తండ్రి సుఖ్రామ్ ముండా తన 82 ఏండ్ల వయసులో కూడా పొలాల్లో పనిచేస్తున్నారు. తన వృద్ధాప్య పింఛను రూ.1,000 నా చదువు ఖర్చులకు సరిపోతున్నది. బిర్సా ‘అబువా డిషుమ్ అబువా రాజ్’ గురించి మాట్లాడేవారు. ఈ రోజు జార్ఖండ్‌లో అబువా రాజ్ ఉన్నప్పటికీ మా పరిస్థితిలో స్వల్పంగానైనా మెరుగుదల లేదు. గిరిజనుల కోసం తయారుచేసిన నియమాలు, పేదల కోసం చేసే పథకాలు అమలుచేస్తూ ప్రయోజనం చేకూరేలా చేస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ధన్యవాదాలు.. అంటూ సీఎంకు రాసిన లేఖలో తన పరిస్థితిని వెల్లడించింది.
జౌని కుమారి ముండా ఖుంటి బజార్ లో కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి ఆసరగా ఉంటున్నది. ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్మే పనిని కూడా చేపడుతున్నది. ఇక్కడి వారు ఎక్కువగా మాట్లాడే ముండారి భాషపై అధ్యయనం చేయడం ద్వారా ఆమె గ్రామానికి, ఇతర పిల్లలకు మంచి విద్యను అందించాలనుకుంటున్నారు. సెమిస్టర్ -3 లో 73.2 శాతం మార్కులు సాధించింది. కాలేజీలో 3 సార్లు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నా లాభం లేకపోయింది.
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బహిష్కరణ
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్‌లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..