ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 15:33:32

ఆర్థికసాయం చేస్తామని నమ్మబలికి.. మహిళను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి..

ఆర్థికసాయం చేస్తామని నమ్మబలికి.. మహిళను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి..

నిజామాబాద్‌ : నిజామాబాద్ జిల్లాలో 26 ఏళ్ల మహిళపై ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈఘటన ఆగస్టు 24న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ మహిళ తన సోదరికి వైద్య చికిత్స అందిచేందుకు గాను ఈనెల 24న నిజామాబాద్‌కు తీసుకొచ్చింది. ఇద్దరు మైనర్లు సహా ఆరుగురు యువకులు మహళకు ఆర్థికసాయం అందజేస్తామని నమ్మబలికి అదే రోజు రాత్రి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్థరాత్రి వరకు యువకులు ఆమెను తమ వద్దే ఉంచుకోగా మంగళవారం 1:30 గంటల సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అటుగా రావడంతో ఆరుగురు నిందితులు మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. 

తరువాత ఆ మహిళ సంఘటనను పోలీసులకు వివరించడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను దవాఖానకు తరలించి నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరుసటి రోజు నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఇద్దరు మైనర్లను జ్యువెనైల్‌ హోంకు తరలించినట్లు పేర్కొన్నారు. తన సోదరి చికిత్స కోసం వారు డబ్బులు ఇస్తామని నమ్మ బలకడంతోనే నిందితులతో వెళ్లినట్లు మహిళ విచారణలో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo