శుక్రవారం 22 జనవరి 2021
Crime - Jan 09, 2021 , 20:01:28

హత్య కేసులో కుటుంబ సభ్యులు ఆరుగురు అరెస్టు

హత్య కేసులో కుటుంబ సభ్యులు ఆరుగురు అరెస్టు

సంగారెడ్డి : హత్య కేసులో సంగారెడ్డి పోలీసులు ఆరుగురు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. భూ వివాదంలో గడిచిన మంగళవారం చౌటకూర మండల కేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యులను ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులను కాశన్నగారి ప్రదీప్‌, సైదులు, ప్రసాద్‌, కరుణాకర్‌, సురేఖ, మణెమ్మగా గుర్తించారు. ఓ భూమి విషయంలో బేగరి కరుణాకర్‌ ఇతని తండ్రి దేవయ్యతో నిందిత కుటుంబానికి వివాదం ఉంది. ఈ నేపథ్యంలో కాశన్నగారి ప్రదీప్‌ ఇతని కుటుంబ సభ్యులు కరుణాకర్‌, దేవయ్యలపై గడిచిన మంగళవారం దాడిచేశారు. ఈ దాడిలో కరుణాకర్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా దేవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి డీఎస్పీ ఏ. బాలాజీ నిందితులను శనివారం నాడు జోగిపేటలో మీడియా ఎదుట హాజరుపరిచారు. 


logo