బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 22, 2020 , 13:29:51

రూ.32లక్షలు విలువైన గంజాయి పట్టివేత.. ఆరుగురు అంతర్రాష్ట స్మగ్లర్లు అరెస్టు

రూ.32లక్షలు విలువైన గంజాయి పట్టివేత.. ఆరుగురు అంతర్రాష్ట స్మగ్లర్లు అరెస్టు

బండా : ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ర్టం బండా జిల్లాలోని మహోఖర్ గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న సుమారు 32.75 కిలోల గంజాయి పట్టుకున్నట్లు ఎస్పీ అలోక్ మిశ్రా అన్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు అంతర్రాష్ట స్మగ్లర్లను కూడా అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం వాహనాన్ని సీజ్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా వారి వద్ద నకిలీ వాహన పత్రాలను గుర్తించినట్లు తెలిపారు. అనుమానం వేసి వాహనం తనిఖీ చేయగా సుమారు  రూ.32 లక్షలు విలువైన గంజాయి ఉందన్నారు. తరువాత ముఠాను అదుపులోకి తీసుకొని విచారించగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి జిల్లాలో విక్రయిస్తామని తెలిపినట్లు చెప్పారు. వారి వాహనం కూడా దొంగలించిందేనని వారు ఒప్పకున్నట్లు తెలిపారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సిటీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు.logo