సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 16:12:57

4కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. ఆరుగురు అరెస్టు

4కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. ఆరుగురు అరెస్టు

లూథియాన : పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానలో హెరాయిన్‌ తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి వీరి నుంచి 4కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు.   ఈ ఆరుగురు ఒకే ముఠాకు చెందినవారని వీరిలో ఇద్దరు అన్నాదమ్ములని వీరి నెట్‌వర్స్‌ చాలా పెద్దదని, బిగ్‌ ఫిష్‌గా వీరికి పేరుందని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏఐజీ సందీప్‌శర్మ తెలిపారు. ఈ కేసులో విచారణను ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

బుధవారం మహారాష్ట్రలోని పూణెనగరంలో కస్టమ్స్‌ అధికారులు 868కిలోల గంజాయిని, 7.5కిలోల ఛరాస్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మత్తు పదార్థాల విలువ రూ.2.10కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో భారీగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు పట్టుబడుతుండడంతో కేంద్ర హోంశాఖ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.


logo