శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 17:13:38

సెప్టిక్‌ ట్యాంకు నుంచి విషవాయువులు లీక్‌.. ఆరుగురు మృతి

సెప్టిక్‌ ట్యాంకు నుంచి విషవాయువులు లీక్‌.. ఆరుగురు మృతి

రాంచీ : సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీకై ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దేవగఢ్‌లోని దేవీపూర్‌లో సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేస్తుండగా లీకైన విషవాయువులను పీల్చడం ద్వారా వీరు మృతిచెందారు. ఈ ఉదయం సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు వెళ్లారు. వీరు ఎంతకి తిరిగిరాకపోయేసరికి ఇంటి యజమాని ఇద్దరు కుమారులు ట్యాంక్‌లోకి ప్రవేశించారు. వీరు సైతం తిరిగిరాకపోయేసరికి సదరు యజమాని పొరుగింటి ఇద్దరిని పిలిచాడు. వీరుకూడా సెప్టిక్‌ట్యాంక్‌లోకి వెళ్లి రాలేదు. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  


logo