ఆదివారం 09 ఆగస్టు 2020
Crime - Aug 01, 2020 , 19:09:26

గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టు

గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టు

మహాసమండ్ : ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని మహాసమండ్ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి నాలుగు క్వింటాళ్ల గంజాయితోపాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మహాసమండ్‌ జిల్లా ఎస్పీ(సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌) ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లున్నారని పేర్కొన్నారు. మహాసమండ్‌ జిల్లాలోని ఉదయగిరి ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వీరు గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో శుక్రవారం 1000 కిలోల గంజాయిని పోలీసులు సీజ్‌ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వీరికి మహాసమండ్‌లో పట్టుబడిన ముఠాతో సంబంధమున్నట్లు ఎస్పీ తెలిపారు. వారణాసిలో గంజాయికి భారీగా డిమాండ్‌ ఉండడంతో యువత ముఠాగా ఏర్పడి ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు చెప్పారు.logo