శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 11:03:33

కేటీకే ఓపీసీ-1 గ‌నిలో రోడ్డుప్ర‌మాదం

కేటీకే ఓపీసీ-1 గ‌నిలో రోడ్డుప్ర‌మాదం

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే ఓసీపీ-1 గని ఆవరణలో మంగ‌ళ‌వారం ఉద‌యం రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. సింగ‌రేణి డంపర్ వాహ‌నం ఢీకొని డిస్మిస్ కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డిగానిపల్లికి చెందిన జడల లింగయ్య(48) పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి ప్రమాదానికి కారణమైన డంపర్‌ను ఎందుకు తీశారని గ్రామ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓసీపీ-1 గని కంట్రోల్ రూమ్‌తో పాటు రక్షణ కార్యాలయాలలోని ఫర్నీచర్, కంప్యూటర్లను గ్రామ‌స్తులు ధ్వంసం చేశారు. logo