గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 13, 2020 , 18:39:22

క్రిమిన‌ల్ కేసులో బెయిల్‌పై ఉన్న వ్య‌క్తిని కాల్చి చంపిన వైనం

క్రిమిన‌ల్ కేసులో బెయిల్‌పై ఉన్న వ్య‌క్తిని కాల్చి చంపిన వైనం


ఢిల్లీ : ఢిల్లీలోని మదు విహార్ ప్రాంతంలో ఆదివారం ఓ వ్య‌క్తి హ‌త్య‌కు గుర‌య్యాడు. బైక్‌పై వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులు రహ‌దారిపై ట్రాఫిక్ రెడ్‌ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగిన కారులోని వ్య‌క్తిపై ప‌లుమార్లు తుపాకీతో కాల్పులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డినుంచి పారిపోయారు. పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కారులోని వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్లుగా గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మృతుడు యేగేశ్‌(33) ద‌క్షిణ‌పురి ప్రాంతంలో కారు వాషింగ్ వ‌ర్క్‌షాప్‌ను న‌డిపిస్తున్నాడు. యేగేశ్ ప‌లు క్రిమిన‌ల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడ‌న్నారు. 2011లో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో సైతం ఇత‌డు నిందితుడిగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ కేసులో అత‌డు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. హ‌త్య ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. 


logo