శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 15:04:14

అక్ర‌మ సంబంధం నెపంతో మూత్రం తాగించారు

అక్ర‌మ సంబంధం నెపంతో మూత్రం తాగించారు

జైపూర్ : ఇది అమాన‌వీయ ఘ‌ట‌న‌.. అక్ర‌మ సంబంధం నెపంతో ఓ యువ‌కుడికి బ‌ల‌వంతంగా మూత్రం తాగించారు. చెట్టుకు క‌ట్టేసి తీవ్రంగా హింసించారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ బార్మ‌ర్ జిల్లాలోని చౌహ‌త‌న్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ఓ యువ‌కుడు వేరే క‌మ్యూనిటీకి చెందిన మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు అనుమానించారు. దీంతో ఆ యువ‌కుడిని రోడ్డుపైకి లాక్కొచ్చి బ‌ల‌వంతంగా మూత్రం తాగించారు. అంత‌టితో ఆగ‌కుండా అక్క‌డున్న చెట్టుకు క‌ట్టేశారు. వెంట్రుక‌లు క‌త్తిరించారు. దారుణంగా కొట్టారు. ఈ దృశ్యాల‌ను కొంద‌రు త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కూడ‌ద‌ని ఇరు వ‌ర్గాలు నిర్ణ‌యించుకున్నాయి. కానీ వీడియో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. యువ‌కుడికి మూత్రం తాగించిన వ‌ర్గంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. 


logo